రష్మిక పెళ్లి క్యాన్సిల్.. అసలు నిజమిది !
కిర్రాక్ హీరోయిన్ రష్మిక మందన తెలుగులో తొలి సినిమా ‘ఛలో’తో ఘన విజయాన్ని అందుకొంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా ‘గీత గోవిందం’లో నటిచింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని గీత ఆర్ట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత రష్మిక పెళ్లికి సిద్ధమైంది. హీరో రక్షిత్ శెట్టిని పెళ్లాడనుంది.
గతేడాదియే వీరికి ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. “కిరిక్ పార్టీ” షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట.. దానిని పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకొన్నారు. ఈ నేపథ్యంలోనే నిశ్చితార్థం కూడా కానిచ్చేశారు. ఐతే, నిశ్చితార్థం-పెళ్లికి మధ్య దొరికిన గ్యాప్ రష్మికకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడంతో ఛలో, గీత గోవిందం సినిమాలు చేసింది. ఐతే, ఇప్పుడు రష్మిక పెళ్లిని క్యాన్సిల్ చేసుకొందనే ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా తలెత్తాయని కొన్ని వార్తలు వచ్చాయి.
ఐతే, ఈ వార్తలో నిజం లేదని రష్మిక ప్రతినిధి తెలిపారు. ‘మొన్నే ఇద్దరు కలిసి బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల ఓ సినిమా ప్రీమియర్‌కు కూడా వెళ్లారు. నిశ్చితార్థం రద్దు అయ్యిందనే ప్రచారంలో నిజం లేదు. వాళ్లిద్దరి ప్రేమ గొప్పది. ఒకరిపై ఒకరు అంతే ఇష్టంతో ఉన్నారు’ అని ఓ లేఖ రాశారు. మరీ.. ఇప్పటికైనా రష్మిక బ్రేకప్ ప్రచారానికి పులిస్టాప్ పడుతుందేమో చూడాలి.