సోనాలి పూర్తిగా గుండుతో..

బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రస్తుతం న్యూయార్కులో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆమెకు సోకిన ఈ వ్యాధి ప్రమాదకరంగా 4వ దశలో ఉండటంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సోనాలి తన అభిమానులు, మిత్రులు అధైర్య పడకుండా ఎప్పటికప్పుడు తన చికిత్సకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

తాజాగా సోనాలి పూర్తిగా గుండు చేయించుకున్నారు. ఈ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఆమెతో పాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మాజీ భార్య సుహానే ఖాన్, బాలీవుడ్ నటి గాయత్రి ఒబెరాయ్ లు ఉన్నారు. “నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ఒంటరిని అనే భావన నాకు కలగడం లేదు. చుట్టూ స్నేహితులు ఉన్నారు. వీరంతా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. నా కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు. నాకు జుట్టు లేదన్న బాధ లేదు. ఎందుకంటే రెడీ అవడానికి ఇప్పడు ఎక్కువ సమయం పట్టదు” అంటూ పేర్కొంది సోనాలి.