వీర భోగ వసంత రాయలు : సుధీర్ బాబు ఫస్ట్ లుక్


కొత్త దర్శకుడు ఇంద్రసేన దర్శకత్వంలో నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, శ్రియ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘వీర భోగ వసంత రాయలు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ మల్టీస్టారర్ నుంచి నారా రోహిత్, శ్రియ, శ్రీవిష్ణు ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి. తాజాగా, సినిమాలో సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. కళ్లజోడుతో చాలా స్టయిలీష్ గా కనిపిస్తున్నాడు సుధీర్ బాబు. ఈ సినిమాలో హీరో అని ఎవరూ లేరు. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ హీరోనే అని చెబుతున్నారు.

ఇందులో సత్యదేవ్ మరో కీలక పాత్ర చేస్తున్నాడు. రోహిత్-శ్రీవిష్ణు కాంబినేషన్లో వచ్చిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’కు దర్శకత్వ విభాగంలో పని చేశాడు ఇంద్రసేన. ఇప్పుడు దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.