బాబోయ్ పులి..! యూనివ‌ర్శిటీలో చిరుత క‌ల‌క‌లం..!!

ఏపీలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. డీడీఈ బిల్డింగ్ ఎదుట ఉన్న రోడ్డుపై చిరుత కదలికలు కనిపించ‌డంతో యూనివ‌ర్శిటీలో భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. ఆ రోడ్డుపైనే రెండు ఆవు దూడలను చిరుత చంపేసిన ఆనవాళ్లు క‌నిపించాయి. హెచ్‌ బ్లాక్ హాస్టల్ సమీపంలోనూ ఎలుగుబంటి సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపించాయని తెలుస్తోంది. దీంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని యూనివ‌ర్శిటీలో విద్యార్థులు హడలిపోతున్నారు. క్రూరమృగాల సంచారంపై యూనివ‌ర్శిటీలో అంతా ఆందోళ‌న‌ వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది సైతం ఒంటరిగా బయట తిరగలేని పరిస్థితి నెలకొంది.