ఆ ఫ్రెండే మ‌హేష్ ప్ర‌పంచ‌మ‌ట‌..!!

స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్బంగా ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ స్నేహితుల‌కు విషెస్ చెబుతూ, స్నేహితుల‌తో గ‌డిపిన క్ష‌ణాల‌ను గుర్తు చేసుకోవ‌డం కామ‌నే. కామ‌న్ పీపుల్ కంటే సినీ న‌టుల స్నేహితులెవ‌రో తెలుసుకోవాల‌ని చాలామందికి ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న ఫ్రెండ్స్ గురించి ఎక్క‌డా చెప్పని మ‌హేష్ ఫ్రెండ్ షిప్ డే సంద‌ర్బంగా ట్విట్ట‌ర్ లో విషెస్ చెప్పారు. మ‌హేష్ విషెస్ చెప్పిన ఆ ఫ్రెండ్ గురించి తెలిసి షాక్ అవ‌డం అభిమానుల వంతైంది.

ఇంత‌కీ ఫ్రెండ్ షిప్ డే రోజున మ‌హేష్ విషెస్ చెప్పిన ఆ ఫ్రెండ్ ఎవ‌ర‌ ఆ ఫ్రెండ్ ఎవ‌రంటే ఆయన భార్య నమ్రతేన‌ట‌. ట్విటర్‌లో ఆమెకు హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘‘నా ఫ్రెండ్! నా ప్రపంచం! అయిన నమ్రతకు ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు’’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ఫ్రెండ్ గా ప‌రిచ‌య‌మైన న‌మ్ర‌త‌తో ప్రేమ చిగురించి పెళ్లితో ఒక్క‌టైన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అందుకే ఫ్రెండ్ షిప్ డే రోజున త‌మ స్నేహాన్ని గుర్తు చేసుకుని ఇలా విషెస్ చెప్పి ఉంటారేమో అని తెగ ఖుషీ అయిపోతున్నారు అభిమానులు.