శింబుతో జాన్వీ కపూర్ రొమాన్స్


అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ‘దఢక్’ సినిమాతో తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమాయే సూపర్ హిట్ కావడంతో జాన్వీ లక్కీ హీరోయిన్ అనిపించుకుంటోంది. ఇప్పుడామె రెండో సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీదేవి దక్షిణాదిన స్టార్ హీరోయిన్ అనిపించుకొంది. జాన్వీ కూడా దక్షిణాదిన సినిమాలు చేసేందుకు రెడీ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తారక్-చరణ్ లతో రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ కోసం హీరోయిన్ గా జాన్వీని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, జాన్వీ కోసం కోలీవుడ్ దర్శక-నిర్మాతలు ట్రై చేస్తున్నారు. దర్శకుడు వెంకట్‌ ప్రభు శింభు హీరోగా ‘మానాడు’ సినిమాని ప్లాన్ చేశాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం హీరోయిన్స్ గా కీర్తి సురేష్, జాన్వీ కపూర్ లలో ఒకరిని తీసుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ విషయాన్ని వెంకట్ ప్రభు స్వయంగా తెలిపారు. మరీ.. శింబుతో రొమాన్స్ చేసేందుకు జాన్వీ ఓకే చెబుతుందేమో చూడాలి.