చంద్రబాబు పాత్ర.. నాకు దక్కిన గొప్ప గౌరవం !


క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తండ్రి పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించన్నున్నారు. చంద్రబాబు పాత్రలో రానా దగ్గుపాటి నటిస్తున్నారు.

ఈ పాత్ర దక్కడంపై రానా స్పందిస్తూ.. “ఎన్టీఆర్ బయోపిక్ లో కీలకమైన చంద్రబాబునాయుడి పాత్రను పోషించే అవకాశం లభించడం నాకు దక్కిన ఎంతో గొప్ప గౌరవం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు నా ధన్యవాదాలు” అని ట్వీట్ చేశాడు రానా. ఇటీవల దర్శకుడు క్రిష్, బాలయ్యలతో కలిసి చంద్రబాబుతో భేటీ అయిన ఫోటో, దానికి సంబంధించిన మీడియా కవరేజ్ ని ఫోటోలని షేర్ చేశాడు రానా.

ఇప్పటికే ‘ఎన్టీఆర్’ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొంది. రెండో షెడ్యూల్ కోసం చిత్రబృందం ఎన్ టీఆర్ సొంత గ్రామం నిమ్మకూరుకు వెళ్లింది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఇక, ఈ బయోపిక్ లో యంగ్ ఎన్ టీఆర్ మోక్షజ్ఝ కనిపించనున్నారు. ఏఎన్నార్ గా సుమంత్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు.