ల‌క్ష్మీపార్వ‌తిగా ఆమని ?


ఎన్టీఆర్ బయోపిక్ లో కీల‌క‌మైన ఘ‌ట్టాలన్నీ ఉంటాయని, కుటుంబ సభ్యుల పాత్రలు కూడా ఉండబోతున్నాయి. ఐతే, ఆ పాత్రల్లో వారే కనిపిస్తారా.. ? ఇతర నటులు కనిపిస్తారా.. ?? అన్నది చూడాలని నిమ్మకూరులో బాలయ్య చెప్పారు. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతీ పాత్ర కూడా ఉంటుందా ? అనే చర్చ మొదలైంది. ఐతే, ఇప్పుడా సస్పెన్స్ కు తెరపడినట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్‌’ బ‌యోపిక్‌లో ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర కూడా ఉన్న‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారమ్. ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర కోసం ఓ సీనియ‌ర్ క‌థానాయిక‌ని తీసుకోవాల‌ని అనుకున్నారు. ఆ పాత్ర‌కు గానూ ఆమ‌ని ఎంపికైంద‌ని స‌మాచారమ్. ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి ఎలా ప్ర‌వేశించింది ? పెళ్లి చేసుకోవ‌డానికి దారితీసిన ప‌రిస్థితులేంటి ?? అనేది చూపించబోతున్నారంట. ఇందుకు సంబంధించి ల‌క్ష్మీపార్వ‌తిని చిత్ర‌బృందం క‌లిసిందా ? లేదంటే.. తెలిసిన స‌మాచారం మేర‌కే ఆ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దుతున్నారా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎన్టీఆర్ బయోపిక్ కు క్రిష్ దర్శకుడు. ఎన్ టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. యువ ఎన్ టీఆర్ గా మోక్షజ్ఝ తెరకు పరిచయం కానున్నారు. ఏఎన్నార్ గా సుమంత్, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, సావిత్రి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతున్నట్టు తెలిసింది.