కరుణానిధి రాజకీయ జీవితం హైలైట్స్
తమిళ ప్రజల ఆరాధ్యనేత కరుణానిధి. తమిళనాడు చరిత్రలో ఆయనది ఒక సువర్ణాధ్యాయం. దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని కనుసైగలతో శాసించిన రాజకీయ చతురుడు. 1969-2011 మధ్య కాలంలో ఐదు పర్యాయాలు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా తమిళ గడ్డను పాలించారు.
కరుణ రాజకీయ జీవితంలో కీలక ఘట్టాలు :
* అన్నాదురై, కరుణానిధి కలిసి ‘ద్రవిడ మున్నెట్ర కళగం’ పార్టీని స్థాపించారు.
* 1967లో తొలి సారిగా తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చింది.
* అన్నాదురై సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
* ఆయన 1969లో కన్నుమూయడంతో కరుణానిధి పార్టీ పగ్గాలు అందుకున్నారు.
* 1971 అసెంబ్లీ ఎన్నికల్లో కరుణ నేతృత్వంలో డీఎంకే ఘనవిజయం
* అత్యవసర పరిస్థితి సమయంలోనూ అధ్యక్షుడిగా కొనసాగారు.
* 1980లో కాంగ్రెస్తో కలిసి కూటమి ఏర్పాటు
* 1996లో కాంగ్రెస్ నుంచి వేరుపడి తమిళ మానిల కాంగ్రెస్ను నెలకొల్పిన జీకే మూపనార్తో పొత్తు
* 1999లో భాజపాతో ఎన్నికల పొత్తు
* 2004లో కాంగ్రెస్తో పొత్తు, లోక్సభ ఎన్నికల్లో ఘనవిజయం
* 2014 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిపోరు
* 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి. సీట్ల సంఖ్యలో భారీగా పెరుగుదల