‘మహర్షి’ టీజర్ వచ్చేసిందోచ్.. !

పుట్టినరోజు కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకి డబుల్ ట్రీట్ ఇచ్చారు. బుధవారం రాత్రి 12గంటలు దాటగానే తన 25వ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు మహేష్. ‘మహర్షి’ టైటిల్ తో కాలేజీ లుక్ లో ఉన్న ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ ఆనందంలో ఉండగానే మహేష్ నుంచి మరో గిఫ్ట్ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే మహర్షి టీజర్ ని విడుదల చేశారు మహేష్.

‘కాలేజీ లో స్టయిల్ గా నడిచుకుంటూ వెళ్తున్న మహేష్.. ఎదురుగా వస్తున్న అమ్మాయిల అందాలని ఆస్వాదిస్తూ.. అందులో ఓ అమ్మాయి బ్యాక్ బాగుందంటూ మహేష్ తిరిగి చూస్తున్న వీడియోని టీజర్ గా కట్ చేశారు’. మహేష్ చాలా రొమాంటిక్ గా కనబడుతున్నాయి. ఈ రొమాంటిక్ టీజర్ పై మీరు ఓ లుక్కేయండీ.. !