చిన్నారులు ఏడిస్తే విమానం దిగిపోవాల్సిందేనా..!!

చిన్న పిల్లాడు ఏడ్చాడ‌ని కుటుంబం మొత్తాన్ని విమానం దింపేసిన ఘ‌ట‌న ఆస‌ల్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బాధితులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్‌కు చెందిన ఓ అధికారి తన కుటుంబంతో పాటు లండన్ నుంచి బెర్లిన్‌కు వెళ్లడానికి బీఏ8495 విమానం ఎక్కారు. బయలుదేరుతుందనగా వారి మూడేళ్ల చిన్నారికి సీటు బెల్టు పెడుతుండ‌గా ఒక్కసారిగా ఏడుపు అందుకున్నాడు. ఎంత‌కీ అతడు ఏడుపు ఆపక‌పోవ‌డంతొ విమాన సిబ్బందిఆ కుటుంబాన్ని, వారి పక్క సీట్లలోఉన్న మరికొంతమంది భారతీయులను ఎయిర్ పోర్టులోనే వదిలేసి వెళ్లిపోయారు.

చివరికి చేసేది లేక సొంత ఖర్చులపై ఎయిర్ పోర్టు నుంచి తమ ఇంటికి వెళ్లిపోయారట‌. జ‌రిగిన విషయాన్నంతా పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు లేఖ ద్వారా తెలియజేశార‌ట ఆ అధికారి. తమపై జాతి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆ లేఖలో ఆయ‌న ఆరోపించారు. ఈ విషయంపై స్పందించిన బ్రిటీష్ ఎయిర్ వేస్ తక్షణమే విచారణకు ఆదేశించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.