గ‌వ‌ర్న‌ర్ ఏం చూసి మెచ్చుకున్నారో చెప్పాలి..!

గవర్న‌ర్ అధ్యక్షత‌న‌ అన్ని యూనివర్సిటీల వి.సి ల సమావేశంలో గవర్నర్ గారు ఏం చూసి సంతృప్తి వ్యక్తంచేశారో గవర్నర్ కార్యాలయం చెప్పాలని బీజేపీ ఎల్పీ నేత కిష‌న్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీ లలో అనేక పోస్టు ఖాళీలు ఉన్నాయని, 70 శాతం పోస్టు లు యూనివర్సిటీ లలో ఖాళీలు ఉన్నాయన్నారు కిష‌న్ రెడ్డి. యూనివర్సిటీ లలో మెస్ లు ఎక్కడ ఓపెన్ కాలేదని, హాస్టల్ లలో పరిస్థితి అధ్వాన్నంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు. విద్యార్థుల హక్కులపై గవర్నర్ కు బాధ్యత ఉంద‌న్నారాయ‌న‌.

యూనివర్సిటీలపై గవర్నర్ అసలు సంతృప్తి వ్యక్తం చేశారా లేదా అనేది ఉప‌ముఖ్య‌మంత్రి చెప్పాల‌ని అన్నారు. తెలంగాణ వ‌చ్చాక యూనివ‌ర్శిటీల‌లో ప‌రిస్థితి ఘోరంగా ఉంద‌ని, విశ్వవిద్యాలయలలో గవర్నర్ పర్యటించాలని ఆయ‌న కోరారు. ఓయూలో ఒక ప్రొఫెసర్ లేని డిపార్ట్మెంట్ లు ఉన్నాయని, యూనివర్సిటీ లలో ఎక్కడ కూడా పరిస్థితి మారలేదన్నారు. యూనివర్సిటీ లకు నిధులను వెంటనే కేటాయించాలని, గవర్నర్ ఏం చూసి మెచ్చుకున్నారో సమాధానం చెప్పాలన్నారు.