వ్యభిచార గృహాల్లో నో ఎంట్రీ బోర్డు..!!
నిన్న, మొన్నటి వరకు సంచలనంగా మారిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట వ్యభిచార ముఠా అంశం, ఇప్పుడు వినూత్నంగా తమ మార్పును తెలియజేస్తున్నారు. యాదరిగిగుట్టలోని దొమ్మర కులస్తులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. చిన్నారుల్ని కిడ్నాప్ చేసి వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతుండటంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దీంతో యాదగిరిగుట్టలో వ్యభిచారం చేసే దొమ్మరకులస్తులంతా క నిర్ణయానికి వచ్చారు. ఇక నుంచి వ్యభిచారం చేయకూడదని మూకుమ్మడిగా నిర్ణయానికి వచ్చారు.
తాము స్వచ్ఛందంగా పడుపు వృత్తిని మానేస్తున్నామని, విటులు ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, లేక బలవంతం చేసినా పోలీసులకు అప్పగించబడును అంటూ వీధిమొత్తం ఫ్లెక్సీలతో బోర్డులను ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఎవరూ కూడా వ్యభిచారం చేయబోమంటూ స్వచ్చందంగా ఇలా బోర్డులు ప్రదర్శించడంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.