ఎన్టీఆర్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరు ?


ఎన్టీఆర్ జీవితంలోకి చంద్రబాబు వచ్చేశారు. ప్రస్తుతం నిమ్మకూరులో ఎన్టీఆర్ తో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.. ఇది ఎన్టీఆర్ బయోపిక్ మేటర్ అని. చంద్రబాబు పాత్ర కోసం రానా దగ్గుపాటిని తీసుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రానా షూటింగ్ లో జాయిన్ అయ్యారు కూడా. చంద్రబాబుగా రానా ఓకే. మరీ.. ఎన్ టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.

ఎన్టీఆర్ పార్టీ స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు ఆయన పెద్దల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు.. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. కొన్ని అనివార్య కారణాల వలన మామ చేతుల్లోకి పార్టీ బాధ్యతలని తీసుకొన్నారు. ఆ విషయం పక్కన పెడితే.. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్ర చూపించినప్పుడు.. దగ్గుపాటి వెంకటేశ్వర రావు పాత్ర చూపించి తీరాల్సిందే. ఈ పాత్ర కోసం దర్శకుడు క్రిష్ స్టార్ హీరోని తీసుకొనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారమ్.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో ఎన్ టీఆర్ గా ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన భార్యగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనుంది. కైకాల, మోహన్ బాబు, సచిన్ కేడ్కర్, ప్రకాష్ రాజ్, రానా దగ్గుపాటి, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్… తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.