రెండు నెలల గ్యాప్’తో చైతూ.. !


సమంతతో పెళ్లి తర్వాత చైతూకి బాగా కలిసొచ్చింది. ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో విజయాలు అందుకొన్నాడు. నటుడిగా మరింత పేరు తెచ్చుకొన్నాడు. ప్రస్తుతం చైతూ నుంచి రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.
ఇందులో ఒకటి.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శైలజారెడ్డి అల్లుడు’. అనుఇమ్మాన్యూయేల్ హీరోయిన్. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ నెల 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండోది.. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సవ్యసాచి’. ఇదో యాక్షన్ థ్రిల్లర్. చైతు సరసన నిధి అగర్వాల్ జతకట్టనుంది.