మళ్లీ.. పవన్ దగ్గరకు రేణు దేశాయ్ !
రేణు దేశాయ్ మళ్లీ పవన్ కళ్యాణ్ దగ్గరగా వస్తుందా ? అంటే అవుననే అంటున్నారు. పవన్ తో విడిపోయిన తర్వాత రేణు పూణేలో ఒంటిరిగానే ఉంటోంది. దాదాపు ఎనిమిదేళ్ల ఒంటరి జీవితాన్ని అనుభవించిన తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకొనేందుకు రెడీ అయింది. ఇటీవలే ఆమె నిశ్చితార్థ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. ఐతే, ఇలాంటి సమయంలో ఆమె మళ్లీ పవన్ దగ్గరగా వస్తున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అలాగని రేణు మళ్లీ పవన్ జీవితంలోకి వస్తుందని కాదట. రేణు దర్శకురాలిగా తెలుగులో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం రేణు ఆంధ్రప్రదేష్ కు రానుంది. ఇక్కడ ఒకట్రెండు నెలల పాటు ఉండబోతుంది. రైతు ఆత్మహత్యల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న తన సినిమా షూటింగ్ కు ఏపీ మంచి లొకేషన్ గా రేణు ఎంచుకొంది. ఈ న్యూస్ తెలిసిన కొందరు రేణు మళ్లీ పవన్ దగ్గరగా వస్తుందని చెప్పుకొంటున్నారు.