ఎన్టీఆర్ సినిమాలో చిరంజీవి కూడా.. !


‘ఎన్టీఆర్’ సినిమాని చూడ్డానికి రెండు కళ్లు సరిపోయేలా లేవు. అంతలా స్టార్స్ తో నిండిపోతోంది ఎన్టీఆర్ బయోపిక్. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్రని కూడా చూపించబోతున్నట్టు సమాచారమ్. ఆ పాత్రలో మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడట. ఇప్పటికే మెగాస్టార్ పాత్ర కోసం దర్శకుడు క్రిష్ వరుణ్ తేజ్ ని కలిసినట్టు చెబుతున్నారు. అంతకంటే ముందే చిరంజీవి అనుపతిని కూడా తీసుకొన్నారట.

ఇంతకీ ఎన్టీఆర్ సినిమాలో చిరంజీవి అవసరం ఎందుకు వచ్చినట్టు ? అంటే.. ఇందులో బాలయ్య పాత్రని హైలైట్ చేయబోతున్నారు. బాలయ్య బాల్యం, తండ్రితో అనబంధం, ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం కావడం.. స్టార్ హీరోగా ఎదిగిన మైనాన్ని చూపించబోతున్నారు. బాలయ్య పాత్రలో జూ. ఎన్ టీఆర్ కనిపించబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. బాలయ్య హీరోగా ఎదిగే ఏపీసోడ్ చూపించాలంటే.. ఆ టైంలో హవా చూపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి పాత్రని చూపించాల్సి ఉంటుంది కదా.. !

ఎన్టీఆర్ సినిమాలో బాలకృష్ణ, చిరంజీవి పాత్రలు కనిపిస్తే.. నాగార్జున, వెంకటేష్ పాత్రలు కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. మరీ.. నాగ్, వెంకీలపై క్రిష్ ఏ నిర్ణయం తీసుకొంటాడన్నది చూడాలి. ఇక, ఎన్టీఆర్ సినిమాలో కైకాల, మోహన్ బాబు, ప్రకాష్ రాజు, సచిన్ కేడ్కర్, రానా దగ్గుపాటి, సుమంత్, ఆమని, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్.. తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.