పాపం.. సోనాలి కన్నీరు పెట్టుకొంది !
క్యాన్సర్తో బాధపడుతున్న బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే ప్రస్తుతం న్యూయార్క్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా ఆమె గుండు చేయించుకొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి సమయంలో తనతో స్నేహితులు ఉన్నారంటూ ధైర్యంగా కనిపించారు.
అలాంటి సోనాలీ ఇప్పుడు కన్నీరు పెట్టుకొంది. ఈరోజు (ఆగస్టు 11) సోనాలి తనయుడు రణ్ వీర్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో భారత్లో ఉన్న కుమారుడ్ని కలవలేని ఆమె భావోద్వేగంతో సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ‘రణ్వీర్.. నా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం నీవే. నీ మానవత్వం, బలం, దయ పట్ల నేను ఎంత గర్వంగా ఉన్నానో చెప్పలేను. నా బుజ్జి కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మనం కలిసి ఉండలేకపోయిన తొలి పుట్టినరోజు ఇది. నిన్ను చాలా మిస్ అవుతున్నా’నని సోనాలి ట్విట్ చేసింది. సోనాలి ట్విట్ ఆమె అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. పాపం.. సోనాలి పరిస్థితి చూస్తుంటే బాధేస్తుంది అంటున్నారు.
Ranveeeeer! My sun, my moon, my stars, my sky… Okay, maybe I'm being a bit melodramatic, but your 13th birthday deserves this. Wow, you're a teenager now… Will need some time to wrap my head around that fact… @rockbehl https://t.co/9bev4ovmeH pic.twitter.com/HjlfVnjVuv
— Sonali Bendre Behl (@iamsonalibendre) August 11, 2018