దర్శకుడి ప్రేమని గెలిపించిన ‘ఆర్ఎక్స్100’ హిట్
టాలీవుడ్ లో ‘ఆర్ఎక్స్100’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అంతకుమింది విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఈ ఒక్క సినిమా ముగ్గురు జీవితాలని మార్చేసింది. దర్శకుడు అజయ్ భూపతి, హీరో కార్తీకేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లకు జీవితాన్నిచ్చింది. ఈ సినిమా తర్వాత ఈ ముగ్గురు బిజీ అయిపోయారు. అంతేకాదు.. దర్శకుడు అజయ్ భూపతి ప్రేమని గెలిపించింది. అవును.. ఈ నెల 25న అజయ్ భూపతి తన చిన్ననాటి స్నేహితురాలు శిరీష్ ని పెళ్లాడబోతున్నాడు.
తాజాగా, అజయ్ భూపతి తన ప్రేమ, పెళ్లి గురించి వెల్లడించారు. “తాను రెండేళ్ల క్రితమే శిరీషకు ప్రపోజ్ చేశాను. కానీ ఉద్యోగం, ఆదాయం లేని కారణంగా వాళ్ల ఇంట్లో పెళ్లికి అంగీకరించలేదు. దీంతో తనకు రెండేళ్ల సమయం ఇవ్వాల్సిందిగా శిరీష కుటుంబ సభ్యుల్ని కోరాను. ఈలోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారుతానని వాళ్లకు మాటిచ్చాను. ఇప్పుడా మాటని నిలబెట్టుకొన్నా. ‘ఆర్ఎక్స్ 100’ ట్రైలర్ రిలీజ్ కాగానే తన మీద శిరీష కుటుంబ సభ్యులకు నమ్మకం వచ్చింది. సినిమా హిట్ కావడంతో పెళ్లికి సంతోషంగా ఒప్పేసుకొన్నారు” అన్ని తెలిపాడు అజయ్.
అజయ్ భూపతి, శిరీష్ లది తూ. గోదావరి జిల్లా ఆత్రేయపురం. వీరి వివాహం ఈ నెల 25న హైదరాబాద్ లోనే జరగనుంది. ఈ వేడుకకి టాలీవుడ్ ప్రముఖులని ఆహ్వానించబోతున్నట్టు అజయ్ తెలుస్తోంది. ఇక, ఆర్ ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతితో చేయబోయే సినిమా ఏంటన్నది త్వరలోనే క్లారిటీ రానుందని చెబుతున్నారు.