చంద్రబాబు గెటప్’లో రానా లుక్.. చూస్తారా ?

ఎన్టీఆర్ జీవితంలో చంద్రబాబు.. ఓ థ్రిల్లర్ ఏపీసోడ్. ఎన్టీఆర్ అల్లుడుగా, ఆపై ఆయన్ని పదవి నుంచి తప్పించి, పార్టీ పగ్గాలు, ముఖ్యమంత్రి పదవి చేపట్టడం పొలిటికల్ థ్రిల్లర్ ని తలపిస్తాయి. ఇప్పుడీ ఏపీసోడ్ ని ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో చూపించబోతున్నాడు దర్శకుడు క్రిష్. చంద్రబాబు పాత్ర కోసం రానా దగ్గుపాటిని తీసుకొని మరింత ఆసక్తి పెంచాడు.

పాలిటిక్స్ రానాకు కొత్తేమీ కాదు. ఆయన తెరపై ఇప్పటికే రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. లీడర్, నేనే రాజు నేనే మంత్రి సినిమాల్లో ఎత్తులు-పై ఎత్తులతో ప్రత్యర్థులని చిత్తుచేశాడు. అలాంటి రానాని రాజకీయ చాణిక్యుడు చంద్రబాబు పాత్ర కోసం తీసుకోవడం మంచి ఎత్తుగడే. ఐతే, చంద్రబాబు గెటప్ లో రానా ఎలా ఉంటాడో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడా లుక్ బయటికొచ్చింది. చంద్రబాబు గెటప్ లో రానా లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. యంగ్ చంద్రబాబు లుక్ లో రానా లుక్ అదిరిపోయింది. అప్పట్లో చంద్రబాబు కోర మీసాలతో.. బలంగా కనిపించేవారు. ఇప్పుడదే లుక్ లో రానా ఇమిడిపోయారని చెప్పవచ్చు. ఐతే, అందరు చంద్రబాబు గడ్డెం లుక్ లో రానా ని చూడాలని ఆశపడుతున్నారు. బహుశా.. ఆ అవకాశం ప్రేక్షకులకు దక్కకపోవచ్చు. సినిమాలో ఎన్ టీఆర్ రెండు సార్లు సీఎం పదవిని చేపట్టడం వరకే చూపించబోతున్నట్టు సమాచారమ్.