నాని దగ్గర దాగుడు మూతలు
దాగుడు మూతలు ఆడేందుకు ఏ హీరో ఆసక్తి చూపడం లేదు. ‘డీజే-దువ్వాడ జగన్నాథమ్’ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ రాసుకొన్న కథ ఇది. స్టార్ హీరోతో ‘దాగుడు మూతలు’ ఆడించబోతున్నానని.. ఫారిన్ వెళ్లి లోకేషన్స్ కూడా చూసొచ్చాడు హరీష్. ఇది కూడా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని తెలిపాడు. ఆ తర్వాత సలైంట్ అయిపోయాడు. ఇటీవల దిల్ రాజు తన బ్యానర్ లో తెరకెక్కిన ఐదు సినిమాల విడుదల తేదీలని ప్రకటించినప్పుడు.. హరీష్ లోని అసంతృప్తి బయటపడింది. ఈ లిస్టులో తన సినిమా లేనందుకు బాధేసిందని ట్విట్ చేశాడు. దీంతో ‘దాగుడు మూతలు’ కథపై దిల్ రాజు నమ్మకంతో లేడని స్పష్టమైంది.
ఆ వెంటనే హరీష్ బయట ప్రయత్నాలు మొదలెట్టాడు. తాజా సమాచారమ్ ప్రకారం 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ హరీష్ దాగుడు మూతలు స్క్రిప్టుని ఓకే చేశారు. నాని హీరోగా ‘దాగుడు మూతలు’ ఉండబోతుందని చెబుతున్నారు. ఇంతకు ముందు దాగుడు మూతలు కోసం స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు చాలా మంది పేర్లే వినిపించాయి. ఇప్పుడు నాని దగ్గర దాగుడు మూతలు ఆగింది. ఇక, అక్కడే ఆగుతుందా.. ? మరో హీరో వద్దకు చేరుతుందా.. ?? అనేది వేచి చూడాలి. ఒకవేళ ‘దాగుడు మూతలు’ కథని నాని ఓకే చేస్తే.. అందులో మేటరు మేటరు ఉన్నట్టే లెక్క.