‘అరవింద సమేత’ టీజర్ లీకులు

తారక్, త్రివిక్రమ్’ల ‘అరవింద సమేత’ టీజర్ స్వాత్రంత్య్ర దినోత్సవం కానుకగా రేపు విడుదల కానుంది. తారకరాముడి మాస్ అవతారాన్ని గురూజి ఫుల్ గా బయటకు తీసినట్టు ఫీ-లుక్ చెప్పకనే చెప్పింది. టీజర్ లో హైలైట్స్ ని ముందే ఊహించే ప్రయత్నం చేస్తున్నారు అభిమానులు. ఇందులో భాగంగా అరవింద సమేత టీజర్ పై రకరకాల గాసిప్ లు పుట్టుకొస్తున్నాయి.

టీజర్ దాదాపు 55 నుంచి 58 సెకెండ్లు వుంటుందని చెబుతున్నారు. సినిమా కథకు సంబంధించిన ఫాస్ట్.. ప్రెజెంట్.. ఫ్యూచర్ మూడు అంశాలు కవర్ చేస్తూ టీజర్ ని కట్ చేసినట్టు సమాచారమ్. టీజర్ లో జగపతిబాబుకు ఓ డైలాగు, ఎన్టీఆర్ కు రెండు డైలాగులు వుండే అవకాశం వుందని తెలుస్తోంది. మరీ.. ఈ టీజర్ లీకుల్లో నిజమెంత ? అనేది మరో కొన్ని గంటల్లో తెలిసిపోనుంది.