‘ఎన్టీఆర్’లో బాలయ్య కనిపించడం లేదు !

పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అంటే ఇదేనేమో. ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో బాలకృష్ణ కనిపించడం లేదు. ఎటీఆర్ మాత్రమే కనిపిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిథ కథ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. తాజాగా, స్వాత్రంత్య్ర దినోత్సవం కానుకగా ‘ఎన్టీఆర్’లుక్ లో ఉన్న బాలయ్య పిక్ ని విడుదల చేసింది చిత్రబృందం.

అచ్చుగుద్దినట్టు ఎన్టీఆర్ లా ఉన్నాడు బాలయ్య. ఆయన బాలయ్య అని చెప్పినా నమ్మేలా కనిపించడం లేదు. అంతలా బాలయ్యని ఎన్టీఆర్ గా ముస్తాబు చేశాడు దర్శకుడు. ఎన్టీఆర్’గా బాలయ్య లుక్ ని హీరో రానా దగ్గుపాటి తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. దాన్ని దర్శకుడు క్రిష్ రీ-ట్విట్ చేశారు. ఇప్పుడీ పిక్ తెలుగు ప్రజలని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఎన్టీఆర్ పాత్ర బాలయ్య అనగానే.. అన్నగారిగా బాలయ్య సరిపొడు అనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడీ సింగిల్ పిక్ తో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు క్రిష్. ఎదైన పాత్ర వేస్తే దానిలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. ప్రాణం పెడతాడు బాలయ్య. ఇప్పుడు తండ్రి ఎన్టీఆర్ పాత్రని ప్రాణం పెట్టి మరీ.. చేస్తున్నాడు.

ఇక, ఎన్టీఆర్ గా బాలయ్య కనిపిస్తున్న.. ఈ బయోపిక్ లో బసవతారకం పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తున్నారు. ఆ పాత్ర ద్వారానే స్టోరీ టెల్లింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఏఎన్నార్ పాత్రలో సుమంత్, చంద్రబాబు పాత్రలో రానా దగ్గుపాటి, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, సూపర్ స్టార్ కృష్ణ పాత్ర మహేష్ బాబు, సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతున్నారు.