రివ్యూ : గీత గోవిందం
నటీనటులు
చిత్రం : గీత గోవిందం
నటీనటులు : విజయ్ దేవరకొండ, రష్మిక మందన
సంగీతం : గోపి సుందర్
దర్శకత్వం : పరుశురాం
నిర్మాతలు : బన్ని వాసు
రిలీజ్ డేటు : 15 ఆగస్టు, 2018.
రేటింగ్ : 3.75/5
‘నేను ట్రెండు ఫాలో అవ్వను. ట్రెండు సెట్ చేస్తా’ ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్. ఇప్పుడదే చేస్తున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో ట్రెండు సెట్ చేశాడు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత క్రేజీ స్టార్ గా మారాడు. పవన్ కళ్యాణ్ తర్వాత ఆ రేంజ్ లో యూత్ ఆకట్టుకొనే కథలని ఎంపిక చేసుకొంటున్నాడు విజయ్. అందుకే ఆయన్ని జూ. పవర్ స్టార్, తెలంగాణ పవర్ స్టార్ గా పిలిపించుకొంటున్నారు ప్రేక్షకులు.
ఈ నేపథ్యంలోనే ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ ఎలాంటి కథని ఎంపిక చేసుకొంటాడు ? ఎలా కనిపించబోతున్నాడు ?? ఆసక్తిగా మారింది. ఐతే, రొమాంటి ఎంటర్ టైనర్ ‘గీత గోవిందం’ని ఎంపిక చేసుకొన్నాడు విజయ్. పరశురామ్ దర్శకుడు. విజయ్-రష్మిక మందన జంటగా నటించారు. టీజర్, ట్రైలర్స్ లో హీరోయిన్ మందనతో విజయ్ చేసిన రొమాన్స్ హైలైట్ గా నిలిచింది. అది సినిమాపై అంచనాలని పెంచేసింది. భారీ అంచనాల మధ్య స్వాత్రంత్య్ర దినోత్సవం కానుకగా ‘గీత గోవిందం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరీ.. గీత గోవిందం విజయ్, రష్మికల ప్రేమకథ ఎలా ఉంది. అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) ఓ మహిళా కాలేజీలో లెక్చరర్. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పద్ధతిగా ఉండాలని కోరుకుంటాడు. సరిగ్గా అలాంటి సమయంలోనే తాను కోరుకున్న అమ్మాయి లక్షణాలు ఉన్న గీత ( రష్మిక మందన)ని చూసి ఇష్టపడతాడు. ఓ పని మీద బస్సులో కాకినాడ వెళ్తున్న విజయ్ పక్కన సీటులోనే గీత కూర్చోవడంతో ఆశ్చర్యానికి గురైన..విజయ్ ఆమెకు తన ప్రేమ విషయాన్ని చెబుదాని డిసైడ్ అవుతాడు. ఇంతలో అనూహ్యంగా చోటుచేసున్న ఓ ఘటనతో విజయ్ ని అపార్థం చేసుకొంటోంది రష్మిక.
ఆ తర్వాత కూడా పలు సందర్భంగా విజయ్ ని అపార్థం చేసుకొనే సంఘటనలు చేసుకొంటున్నాయి. ఇంతకీ ఆ అపార్థాలు ఎలా తొలగిపోయాయి. విజయ్ గీత ప్రేమను ఎలా చేసుకొన్నాడని అన్నది ఎంటర్ టైనింగ్ అండ్ ఎమోషన్స్ తో కూడిన మిగితా కథ గీత గోవిందం.
ఎలా ఉందంటే ?
దర్శకుడు పరశురామ్ సింపుల్ కథని ఎంచుకొన్నాడు. ప్రేమ జంట మధ్య అపార్థాలు అనే పాయింట్ టాలీవుడ్ కి కొత్తేమీ కాదు. ఐతే ట్రీట్ మెంట్ కొత్తగా ఉంది. రొమాంటి ఎంటర్ టైనర్ ఏమాత్రం బోర్ రాకుండా సన్నివేశాలు అల్లుకొన్నాడు. సినిమా ప్రారంభంలోనే హీరో విజయ్ దేవరకొండ నిత్యామీనన్ తో తన ప్రేమకథని చెప్పడం మొదలు పెట్టి సినిమాపై ఆసక్తి పెంచాడు దర్శకుడు. ఆ కొద్దిసేపటికే హీరోయిన్ అనుఇమ్మాన్యూయేల్ ని అతిథి పాత్రలో ఎంట్రీ ఇప్పించి తెరని మరింత కలర్ ఫుల్ చేశాడు. ఆ వెంటనే హీరో-హీరోయిన్ రొమాంటి సీన్స్, టీజింగ్ సన్నివేశాలతో డీల్ చేశాడు. ఫస్టాఫ్ లో విజయ్-రష్మికల కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది.
సెకాంఢాఫ్ లో ప్రేమజంట మధ్య అపార్థాలు, అవి ఎలా క్లియర్ అయ్యాయి అన్నది ఆసక్తిగా చూపించాడు. ఎమోషనల్ సీన్స్, ఓ ట్విస్టుతో సినిమాని ఎక్కడ పడకుండా బండిని లాగించాడు. సినిమాలో విజయ్-రష్మికల కెమిస్ట్రీ హైలైట్. ఆ తర్వాత స్థానం కామెడీ. ఏం చెప్పినా, ఏం చూపించిన వినోదాత్మకంగా చెబితే ఆ టేస్ట్ యే వేరు. గీత గోవిందం వినోదాత్మకంగా సాగిన రొమాంటిక్ ఎంటర్ టైనర్.
ఎవరెలా చేశారంటే ?
ఇంకా విజయ్ దేవరకొండని అర్జున్ రెడ్డిగానే చూస్తున్నారు ప్రేక్షకులు. అలాంటి టైంలో విజయ్ ఓ రొటీన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించడం అంటే సవాలే. సవాల్ ఎదుర్కోవడం విజయ్ కి కొత్తమీ కాదు. తన జీవితమే ఓ సవాల్ అని గీత గోవిందం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ చెప్పిన సంగతి తెలిసిందే. గోవిందం పాత్రని సవాల్ గా తీసుకొని చేశాడు విజయ్. ఆ పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. సెటిల్డ్ గా నటించారు. అర్జున్ రెడ్డి ఛాయలు ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. తాను నీటిలాంటోన్ని.. ఏ పాత్రలోపోస్తే ఆ రూపంలోకి మారిపోతానని రుజువు చేశాడు.
గీతగా రష్మిక మందన నటన సూపర్భ్. ఆమె కళ్లతో, చూపుతో, టిట్లతో నవ్వుతోనూ నటించేస్తోంది. ఇలాంటి నటి త్వరలో పెళ్లి చేసుకోబోవడం ప్రేక్షకుల బ్యాడ్ లక్ అని చెప్పాలి. విజయ్ – రష్మికల మధ్య వచ్చే టీజింగ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ యూత్ పిచ్చ పిచ్చగా నచ్చేస్తాయి. సినిమాలో కామెడీ బ్యాచ్ బాగానే నవ్వించింది. కథ మొత్తం విజయ్-రష్మికల చుట్టూనే తిరిగుతోంది. దీంతో ఇతర నటీనటుల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. విజయ్ తండ్రిగా నాగబాబు కనిపించారు. ఐతే, ఈసారి ఆయన గొంతు వినిపించలేదు. కొన్ని కారణాల వల్ల నాగబాబుకు ఇతరులతో డబ్బింగ్ చెప్పించారు.
సాంకేతికంగా :
మణి కందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం రెండు బాగున్నాయి. సినిమా సెకాంఢాఫ్ ప్రారంభంలో సినిమా కాస్త స్లోగా అనిపించింది. చిన్న పాత్రలకి కూడా మెయిన్ హీరోయిన్స్ ను గెస్ట్ అపీరియన్స్ గా పెట్టి సినిమాలో చాలా స్పెషల్ అట్రాక్షన్స్ ఇచ్చారు. ఎడిటింగ్ ఓకే. గీతాఆర్ట్స్ 2 నిర్మాణ విలువలు బాగున్నాయి.
బాటమ్ లైన్ : గీత గోవింద.. వినోదాత్మక ప్రేమకథా చిత్రమ్.
రేటింగ్ : 3.75/5