వరద ముంపులో శబరి…
శబరిమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు వారాలుగా పంబా, సన్నిధానంలోకి రాకపోకలు నిలిపివేశారు. పంబా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పంబా బ్రిడ్జి మునిగిపోయింది. ఈ నెల 16 నుంచి 27వ రకు ఓనం ఉత్సవాలు ఉండటంతో ప్రత్యేక దర్శనాలకు బ్రేక్ ఇచ్చారు ఆలయ అధికారులు. భారీ వర్షాల కారణంగా శబరిమలకు ప్రయాణాలు మానుకోవాలని అధికారులు యాత్రీకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. శబరిమల అయ్యప్పస్వామి ఆలయం పరిసరాలలో పూర్తిగా వరదనీరు వచ్చి చేరుతోంది. జింకలు దుప్పులు నదిలో కొట్టుకు పోతున్నాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఈ చిత్రాలలో చూడొచ్చు.