‘గీత గోవిందం’ తొలి రోజు లెక్కెంత ?

స్వాత్రంత్య్ర దినోత్సవం కానుకగా బుధవారం ‘గీత గోవిందం’ రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొచ్చారు. వీరి ప్రేమకథకు ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొంది. ప్రేమకథని వినోదాత్మకంగా డీల్ చేయడం, విజయ్, రష్మికల కెమిస్ట్రీ సినిమాలో హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు. పాజిటివ్ టాక్ తో ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి.

తొలిరోజు ‘గీత గోవిందం’ రూ. 9.66 కోట్ల షేర్ ను రాబట్టారు. తెలుగు రాష్ట్రల్లో రూ. 5.80 కోట్ల షేర్ ను కలెక్ట్ చేశారు. హాలీడే కావడం గీత గోవిందం కు బాగా కలిసొచ్చింది. ఈ ప్రేమకథ బాగుందని మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు… కితాబిచ్చారు. దీంతో రెండో రోజు నుంచి గీత గోవిందం వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ‘గీత గోవిందం’కు పరశురామ్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు.