వాజ్ పెయిలో ఆ టాలెంట్ చూసి అధ్వానీ ఫీలయ్యేవారట.
అటల్ బిహారీ వాజ్ పేయికి, అద్వానీ మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిద్దరూ ఎంత సన్నిహితులనేది దేశమంతా తెలిసిందే. ఒకరికొకరు అంతగా ప్రాధాన్యతను, విలువలు ఇచ్చుకునేవారు వీరిద్దరూ. వాజ్ పెయి ప్రభుత్వంలో లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానిగా కూడా పనిచేశారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా, ఒక విషయంలో మాత్రం వాజ్ పెయిని చూసి అద్వానీ ఎప్పుడూ ఫీలవుతుండేవారట. వాజ్ పేయిలాంటి వాగ్దాటి తనకు లేదని అద్వానీ చాలా సందర్భాల్లో ఒప్పుకున్నారు.
వాజ్‌పేయి భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అద్వానీని అధ్యక్ష పదవిని చేపట్టమని అడిగారట. అందుకు అద్వానీ నిరాకరించారట. తాను వేలాది మంది ముందు వాజ్ పేయి లాగా మాట్లాడలేనంటూ వాజ్ పేయికి తేల్చి చెప్పారట. పార్లమెంటులో బాగానే మాట్లాడతావు కదా అంటూ వాజ్ పేయి వారించినా అద్వానీ వినలేదట. ఆ తర్వాత అద్వానీ పార్టీ అధ్యక్షుడైనా వాజ్‌పేయిలా మాట్లాడలేననే భావన మాత్రం ఆయనలో అలాగే ఉండిపోయిందని చెబుతుంటారు అద్వానీ.