అక్కడే వాజ్ పేయి అంత్యక్రియలు.
భారత మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్ పేయి అస్తమించారు. రాజకీయ భీష్ముడిగా పేరొందిన ఆయన అనారోగ్యంతో మరణం దేశానికి తీరని లోటు. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వాజ్ పెయి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం 5గంటలకు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల వరకు కృష్ణమీనన్ మార్గంలోని ఆయన నివాసంలో భౌతికకాయాన్ని ఉంచుతారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించి మద్యాహ్నం ఒకటిన్నర వరకు ప్రజల సందర్శన కోసం ఉంచుతారు. ఆ తరువాత అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 5గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్ లో అంత్యక్రియలు జరుగుతాయి.