టీజర్’లో చూపిన ఆ సీన్.. సినిమాలో హైలైట్ కానుందట !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఎట్టుట్టదో ‘అరవింద సమేత’ టీజర్ తో మరోసారి రుజువైంది. త్రివిక్రమ్ మాటల తూటాలకు తారక్ యాక్షన్.. అదిరిపోయింది. మండువేసంగి.. మచ్చల పులి.. మంచు తుఫాన్.. సృష్టించే బీభత్సాలని తారక్ సృష్టించబోతున్నట్టు టీజర్ లో హింట్ ఇచ్చేశాడు త్రివిక్రమ్. ఐతే, టీజర్ లో ఎన్టీఆర్ షర్ట్ లేకుండా విలన్స్ వెనక పరుగెడుతూ.. వెళ్తున్న సీన్ మాస్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్తుకొంటోంది. అంతకుమిందు.. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లోనూ ఈ సీన్ కి సంబంధించిన పిక్ ని విడుదల చేశారు.

ఆ సీన్ సినిమాలో 15నిమిషాల పాటు ఉంటుందట. తారక్ షర్ట్ లేకుండా విలన్స్ ని ఊతకోచ కోసే ఆసీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం తారక్ సన్నబడ్డాడు. సిక్స్ ప్యాక్ బాడీని డెవలెప్ చేశాడు. ఇదంతా… ఆ 15నిమిషాల యాక్షన్ ఏపీసోడ్ కోసమే కష్టపడ్డాట. ఆ ఒక్క సీన్ కోసం తారక్ ని సన్నబడాలని త్రివిక్రమ్ సూచించినట్టు చెబుతున్నారు. యాక్షన్-ఫ్యాక్షన్ తారక్ కి కొండిన పిండి. దాన్ని ఈసారి త్రివిక్రమ్ మార్క్ తో చూడబోతున్నాం. టీజర్ లోనే యాక్షన్ అదిరిపోయింది. సినిమాలో ఇంకే రేంజ్ లో ఉంటుందన్నది చూడాలి.

ఈ సినిమాలో తారక్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. తారక్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. నాగబాబు , జగపతి బాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం. రాథాకృష్ణ నిర్మాత.