చరణ్ సినిమా.. బ్యాడ్ న్యూస్ !

రామ్ చరణ్ మెగా అభిమానులని నిరాశపరిచాడు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ‘సైరా’
టీజర్ ని విడుదల చేయబోతున్నారు. మ‌రోవైపు, రామ్ చ‌ర‌ణ్ – బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని సైతం విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకున్నారు. దీంతో డబుల్ ట్రీట్ లభించబోతుందని మెగా అభిమానులకు ఖుషీగా ఫీలవుతున్నారు. ఇంతలో చరణ్ నుంచి బ్యాడ్ న్యూస్ వచ్చేసింది.

చరణ్ నుంచి మెగాస్టార్ బర్త్ డే కానుక లేదని తెలిసింది. చ‌ర‌ణ్ లుక్ ఇప్ప‌ట్లో రాద‌ట‌. టైటిల్ కోసం కూడా కొన్ని రోజులు ఆగాల‌ట‌. చిరు పుట్టిన రోజు సంద‌ర్భంగా చ‌ర‌ణ్ సినిమాకి సంబంధించిన లుక్ గానీ, టైటిల్‌గానీ విడుద‌ల చేయాల‌ని భావించిన మాట నిజ‌మేన‌ని, ఐతే.. చ‌ర‌ణ్ సినిమా టైటిల్ విష‌యంలో ఇంకా ఫైనల్ కాలేదని చెబుతున్నారు. పైగా ఆ రోజు `సైరా` టీజ‌ర్ మాయ‌లో ఉంటారంతా. ఇలాంటి టైం చరణ్ సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్‌ల‌కు త‌గినంత ప్ర‌చారం ఉండ‌దేమో అన్న అనుమానాలు చిత్రబృందాన్ని ఆలోచనలో పడేసింది.

సింపుల్ గా చరణ్ – బోయపాటి చిత్రబృందం నుంచి మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ పోస్టర్ లేదంటే ఓ ట్విట్ తో సరిపెట్టనున్నారు. ఇక, తండ్రి చిరు బర్త్ డే కానుకగా ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వడం చరణ్ కు అలవాటు. మరీ.. ఈ బర్త్ డేకు ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నారనది చూడాలి.