కోడలు మరోసారి సప్రైజ్ ఇచ్చింది

కింగ్ నాగార్జున కోడలు సమంత ఇచ్చిన సప్రైజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. సమంత నటిస్తున్న ‘యు-టర్న్’ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్‌ చూసిన నాగార్జున తన కోడల్ని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. ‘వావ్‌.. నువ్వు సర్‌ప్రైజ్‌ ఇవ్వకుండా ఉండవు కోడలా..! మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’ ట్విట్ చేశారు. దీనికి సమంత గెంతులేస్తూ.. డ్యాన్స్‌ చేస్తున్న ఎమోజీలు పోస్ట్‌ చేశారు. ‘నన్ను ఎప్పుడూ ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు మామ’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

సమంత భర్త, హీరో నాగ చైతన్య కూడా యు-టర్న్ ట్రైలర్ పై స్పందించారు. ‘నా లేడీ కొత్త సినిమా ‘యూటర్న్‌’. ఆమె పరిధిని దాటి నటిగా వృద్ధి చెందడం సంతోషంగా ఉంది. మొత్తం యూనిట్‌కు శుభాకాంక్షలు‌’ అని చైతూ ట్వీట్‌ చేశారు. ఇక, ‘చక్కగా నటించావు సమంత’ అని రానా దగ్గుపాటి ట్విట్ చేశారు.

కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ యు-టర్న్ కి రిమేక్ ఇది. మాతృక దర్శకుడు పవన్‌ కుమార్‌.. తెలుగు యు-టర్న్ కి దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌, భూమిక కీలక పాత్రలో పోషిస్తున్నారు. కథని రిలీవ్ చేయకుండా.. అసలు కథ ఏంటీ ? అని ఆసక్తికలిగేలా ట్రైలర్ ని కట్ చేశారు. ఈ సినిమా సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.