కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి.
గత వందేళ్లలో కనీవినీ ఎరుగని జలవిలయం సంభవించడంతో కేరళ పరిస్థితి దారుణంగా మారింది. అనేక మంది వరదల్లో చిక్కుకుని వరద ముంపు నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తమ వంతుసాయాన్ని అందిస్తున్నాయి. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ కూడా ప్రారంభించాయి స్వచ్చంద సంస్థలు. అయితే ప్రధాని మోదీ ఇప్పటికే కేరళ కు 800కోట్ల సాయాన్ని ప్రకటించారు. అయితే కేంద్రం కేరళ వరదల విషయంలో ఆలస్యం చేయొద్దని, వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని మోదీని ట్విట్టర్ ద్వారా కోరారు.