ఎన్టీఆర్ చిత్రం.. రెండు లీకులు !
మహానటుడు, రాజకీయవేత్త ఎన్టీఆర్ జీవిత కథ ‘ఎన్టీఆర్’ పేరిట తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలయ్య నటిస్తున్నారు. బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనున్నారు. చంద్రబాబుగా రానా దగ్గుపాటి, శ్రీదేవిగా రకుక్ల్ ప్రీత్ సింగ్, సావిత్రిగా కీర్తి సురేష్ లని తీసుకొన్నారు.
తాజాగా, ఎన్ టీఆర్ చిత్రం కోసం జమున పాత్ర కోసం రాశీఖన్నాని తీసుకొన్నట్టు తెలిసింది. ఇక, ఎన్ టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర కోసం భరత్ రెడ్డి తీసుకొన్నారు. ఎన్ టీఆర్ రాజకీయరంగ ప్రవేశం చేయడంలో వెంకటేశ్వర రావు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు పాత్ర కంటే ముందే దగ్గుపాటి పాత్ర సినిమాలో కనిపించనుంది. ఈ పాత్ర కోసం స్టార్ నటుడిని తీసుకొంటారనే ప్రచారం జరిగింది. ఫైనల్ గా భరత్ రెడ్డిని తీసుకొన్నారు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఎన్ టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో జరుగుతోంది. ఎన్ టీఆర్ సొంతింటిలో చిత్రీకరిస్తున్నారు. దాదాపు రూ. 50కోట్ల బడ్జెట్ తో ఎన్ టీఆర్ తీసుకురానున్నారు. తెలుగు, తమిళ్, హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. వచ్చే యేడాది సంక్రాంటి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.