ఫిలింన‌గ‌ర్ లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం..!!

హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌ళ్లీ డ్ర‌గ్స్ క‌ల‌క‌లం మొద‌లైంది. గ‌తంలో ఎన్నో దాడులు నిర్వ‌హించి ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ ఇప్పుడు డ్ర‌గ్స్ ముఠా త‌మ దందా మొద‌లుపెట్టింది. డ్ర‌గ్స్ మాఫియాతో సంబంధం ఉన్న సినీ ఇండస్ట్రీని కూడా విచారించిన అధికారులు ఆ కేసును ఇప్పుడు అంత‌గా సీరియ‌స్ గా తీసుకోక‌పోవ‌డంతో డ్ర‌గ్ మాఫియా త‌న వ్యాపారం మొద‌లుపెట్టింది.

తాజాగా జూబ్లిహిల్స్ ఫిలింన‌గ‌ర్ లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం మొద‌లైంది. గుట్టు చ‌ప్పుడు కాకుండా డ్ర‌గ్స్ ను స‌ప్లై చేస్తున్న నైజీరియ‌న్ ను ఎక్సైజ్ ఎన్ఫోర‌స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. అత‌ని వ‌ద్ద నుంచి 3గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.