కేరళ వరద బాధితులకు సూపర్ స్టార్ మహేష్ త‌న‌వంతు సాయం

గత ప‌ది రోజులుగా కేరళ లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణ నష్టం తో పాటూ ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. దేశ వ్యాప్తంగా కేర‌ళ బాధితుల‌ను ఆదుకునేందుకు ఎవ‌రికి తోచిన‌సాయం వారు చేస్తున్నారు. సినిమా ఇండ‌స్ట్రీ నుంచి కూడా స్టార్స్ ముందుకు వ‌స్తున్నారుఉ. ఈ నేప‌థ్యంలో బాధితుల కి చేయూతను అందించడానికి టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ తన వంతు సహాయంగా కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలు అందిస్తున్నారు.