హిందీ ‘గూఢచారి’కి ఫుల్ డిమాండ్
యంగ్ హీరో అడివి శేష్ కథ ని అందించి హీరోగా నటించిన చిత్రం ‘క్షణం’. సూపర్ హిట్టయ్యింది. ఇతర బాషల్లోకి క్షణం వెళ్లింది. బాలీవుడ్ లో ‘భాగీ 2’గా రీమేక్ చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాదాపు రూ. 200కోట్లు వసూలు చేసింది. క్షణం తర్వాత శేష్ కథని అందించి హీరోగా నటించిన చిత్రం ‘గూఢచారి’. తెలుగులో సూపర్ హిట్టయ్యింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ భారీ వసూళ్లని రాబట్టింది.
ఇప్పుడీ ఈ సినిమా హిందీ రిమేక్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. పలు బాలీవుడ్ బ్యానర్లు గూఢచారి హక్కుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారమ్. ఇందుకోసం భారీగా ఆఫర్ చేస్తున్నారట. ఇప్పటికే గూఢచారి భారీ
లాభాలని తీసుకొచ్చాడు. ఇప్పుడు హిందీ రిమేక్ రూపంలో వచ్చేది మరిన్ని లాభాలని తెచ్చిపెట్టేలా కనిపిస్తొంది.
శేష్ సినిమాలకు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ మంచి డిమాండ్ ఉండటం విశేషం.