ఎన్టీఆర్ సినిమా కోసం.. ఆ సినిమాని పక్కన పెట్టేశాడు !

ఎన్టీఆర్ బయోపిక్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే, ఈ సినిమాని 2019 సంక్రాంతికి విడుదల చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకొన్నారు బాలకృష్ణ. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి శరవేగంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘మణికర్ణిక’ కూడా పక్కన పెట్టేశాడు.

ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా మణికర్ణిక తెరకెక్కుతోంది. వచ్చేయేడాది జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా 25న విడుదలకు మణికర్ణికనిప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. ప్రస్తుతం ప్యాచ్‌వ‌ర్క్‌ జరుగుతోంది. అదీ కూడా క్రిష్ లేకుండానే. క్రిష్ ‘ఎన్టీఆర్’ బయోపిక్ తో బిజీగా ఉన్నారు. దీంతో ‘మణికర్ణిక’ చిత్రానికి సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. దాంతో రచయితలు విజయేంద్ర ప్రసాద్, ప్రసూన్ జోషి సహకారంతో కంగనా రనౌత్ చిత్రాన్ని పూర్తిచేసే బాధ్యతను చేపట్టారు.

మధ్య మధ్యలో క్రిష్ ముంబై వెళ్లి వస్తున్నారు. ఎప్పటికప్పుడు నిర్మాణాంతర కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తూ మణికర్ణిక చిత్రబృందానికి అందుబాటులో వుంటున్నారు. ఇక, ప్రసూన్ జోషి సహకారంతో కంగనా రనౌత్ చిత్రాన్ని పూర్తిచేసే బాధ్యతను చేపట్టారు. ఈ రెండు సినిమాలు క్రిష్ కు మంచి పేరు తెచ్చిపెడతాయని చెబుతున్నారు.