‘సైరా’ టీజర్ రెడీ.. !

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుక రెడీ అయ్యింది. ‘సైరా’ టీజర్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు టీజర్ ని వదలనున్నారు. దీనిపై ఈ చిత్ర సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది స్పందించారు. ‘నేను కూడా ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తున్నాను. ఇలాంటి చారిత్రక సినిమాలో భాగం అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి అయింది. మీ ఫీడ్ బ్యాక్ కోసం వేచి చూస్తున్నా’ అని ట్విట్ చేశారు త్రివేది.

ఈ ఉదయం సైరా మ్యూజికల్ ప్రోమోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉడాన్’, ‘వేక్‌ అప్‌ సిడ్‌’, ‘ఐషా’, ‘దేవ్‌ డి’, ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’, ‘బాంబే వెల్వెట్‌,’ ‘ఉడ్తా పంజాబ్‌’, ‘క్వీన్’ చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన అమిత్‌ తెలుగులో ‘సైరా’కు సంగీతం అందిస్తున్నట్లుగా ఈ ప్రోమోలో చూపించారు.

భారీ బడ్జెట్ తో చరిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల వేసవిలో సినిమాని ప్రేక్షకుల ముందుకు రానుంది.