‘గోవిందుడు’ ముందు ‘గోల్డ్’ తక్కువే !
‘బాహుబలి’తో తెలుగు సినిమా సత్తా ఏంటన్నది ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు తెలుగు సినిమాకు బాలీవుడ్, విదేశాల్లోనూ గౌరవం పెరిగింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ విదేశాల్లో బాలీవుడ్ సినిమాలని మించి రాణిస్తోంది. ఇప్పటికే గీత గోవిందం యుఎస్ లో 1.5 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. ఆస్ట్రేలియాలో బాలీవుడ్ సినిమాలని మించి రాణిస్తోంది.
అక్కడ బాలీవుడ్ సినిమాలు గోల్డ్, సత్యమేవ జయతే కలిపి 1.92లక్షల డాలర్లు వసూళ్లు చేయగా… గీత గోవిందం మాత్రం 2 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పేర్కొన్నారు. గోవిందుడి హవాని చూసి బాలీవుడ్ స్టార్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఇక, తెలుగు రాష్ట్రాల్లో గీత గోవిందంకు అడ్డే లేకుండా పోయింది. ఇక్కడ వారం రోజుల్లో రూ. 50కోట్లు కలెక్ట్ చేసింది. అంతకుమించి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అనిపించుకొన్నాడు. మెగాస్టార్ చిరంజీవి యే విజయ్ నటనకి ఫిదా అయియాడు. ఈ యంగ్ హీరో తన, తన తమ్ముడుపవన్ కళ్యాణ్ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు.
Guess which Indian film has proven a tough opponent to #Gold and #SatyamevaJayate in Australia? Telugu film #GeethaGovindam, starring Vijay Deverakonda… The *combined* weekend biz of the two Hindi films [A$ 192,306] is less than that of #GeethaGovindam [A$ 202,266]. @comScore
— taran adarsh (@taran_adarsh) August 20, 2018