లావణ్య.. బ్యాడ్ గర్ల్ !


టాలీవుడ్ అందాల రాక్షసి.. లావణ్య త్రిపాఠి. అందం, అభినయం తెలిసిన హీరోయిన్. అయినా స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. దాని కోసం గ్లామర్ డోస్ కూడా పెంచింది. ఐనా కలిసిరావడం లేదు. ఆమె వదలుకొన్న సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ కోసం ముందుగా లావణ్యనే అనుకొన్నారు. ఐతే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాని వదలుకుంది లావణ్య. ఆ అవకాశం రాశీఖన్నా ఒడిసిపట్టుకొంది. సూపర్ హిట్ కొట్టేసింది.

విజయ్ దేవరకొండ గీత గోవిందం కోసం ముందుగా లావణ్యనే అనుకొన్నారు. ఆమెపై ఫోటో షూట్ ను కూడా చేశారు. ఐతే, చివరి నిమిషంలో ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. ప్రస్తుతం గీత గోవిందం సృష్టిస్తున్న హవా గురించి తెలిసిందే. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు సూపర్ హిట్ చిత్రాలని వదులుకొని బ్యాడ్ గర్ల్ అనిపించుకొంది లావణ్య.