‘దీపికా’ కాదు ‘చీపికా’

హీరోయిన్ దీపికా పదుకొనె మాజీ ప్రియుడు రణ్ బీర్ కపూర్ ని ఇంకా మరచిపోనట్టుంది. రణ్ బీర్ తాలుకు తీపి జ్ఝాపకాలని ఇంకా పదిలంగా ఉంచుకొంది. ఆదివారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఈ సందర్భంగా రణ్ బీర్ తో దిగిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది దీపికా. ‘తమషా’(2015) షూటింగ్‌ సందర్భంగా క్రొయేషియాలో రణ్‌బీర్‌ కపూర్‌తో దిగిన ఫోటో అది. దీనిపై దీపికపై నెటిజర్స్ మండిపడుతున్నారు.

మరి కొద్ది రోజుల్లో ఇంకొకరిని వివాహం చేసుకోబోతూ ఇదేం పని’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

* నువ్వు నీ గతాన్ని షేర్‌ చేస్తే నీ జీవితం కూడా తమాషా అవుతది

* నువ్వు దీపిక కాదు చీపికా

* నువ్వు త్వరగా ఒక మానసికి నిపుణుడిని కలిస్తే మంచిది

* నీ హృదయం ఇంకా నీ మాజీ బాయ్‌ఫ్రెండ్‌ కోసమే తపిస్తోంది.. కానీ ఇప్పుడు నువ్వు నీకు ఏ మాత్రం ఇష్టం లేని ఒక వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నావు.. ఎందుకంటే సింగిల్‌గా ఉండి నీకు బోర్‌ కొట్టింది కాబట్టి.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై దీపిక ఏమైనా వివరణ ఇస్తుందేమో చూడాలి.

Capturing Moments 📸📸 #WorldPhotographyDay

A post shared by Deepika Padukone (@deepikapadukone) on