‘సైరా’ టీజర్ థియేటర్స్ లో ఎప్పుడంటే ?

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గిఫ్ట్’గా ‘సైరా నర్సింహారెడ్డి’ టీజర్ వచ్చేసింది. ఇప్పుడీ టీజర్ ని చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ఐతే, టీజర్ ని యూట్యూబ్ లో మాత్రమే విడుదల చేశారు. మరీ.. థియేటర్స్ లోకి ఎందుకు తీసుకురాలేదు ? ఈ ప్రశ్ననే ఓ మీడియా మిత్రుడు రామ్ చరణ్ ని అడిగారు.

దీనిపై రామ్ చరణ్ సమాధానం ఇస్తూ.. “టీజర్ లో జంతువులు కనిపించాయి. దీంతో టీజర్ ని థియేటర్స్ ప్లే చేసేందుకు అనుపతి తీసుకోవాల్సి ఉంది. 20రోజుల ముందుగానే అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఆ విషయం జాప్యం జరిగింది. మరో ఒకట్రెండు వారాల్లో సైరా టీజర్ ని థియేటర్స్ లో చూడొచ్చు. అప్పుడు ఏ సినిమాలు విడుదలైతే.. ఆ సినిమాలతో కలిసి సైరా టీజర్ ని థియేటర్స్ లో చూడొచ్చు” అన్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నర్సింహారెడ్డి ‘ తెరకెక్కుతోంది. చిరు సరసన నయనతార జతకట్టనుంది. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాని వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.