నయూమ్ అనుచరుడికి టీఆర్ఎస్ టికెట్ !
తెలంగాణ పోలీసులపై ఒక విషయంలో అనుమానం కలుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. నయీమ్ కేసు లో బాధితుల ను పట్టించుకునే నాధుడు లేడని, నయీమ్ అనుచరుడు శేషన్నను ఎందుకు పట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నయీమ్ గ్యాంగ్ ను శేషన్న ఇంకా రక్షిస్తున్నా డీజీపీ ఈ శేషన్న ను ఎందుకు అరెస్ట్ చెయ్యడం లేదని అన్నారు. శేషన్నను కేటీఆర్ ఎన్నికల్లో నిలబెడుతారేమో అంటూ ఆయన ఎద్దేవా చేశారు.