టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల సోద‌రుడు అనుమానాస్ప‌ద మృతి.

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు గంగుల ప్రభాకర్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. కరీంనగర్ శివారులోని రేకుర్తి వంతెన వద్ద ఆయ‌న మృత‌దేహం ప‌డి ఉండ‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఉదయం వాకింగ్ వెళ్లిన సమయంలో గుండెపోటుతో మృతి చెందిన‌ట్లు ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు. మృతదేహాన్ని కరీంనగర్ మాక్స్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంత‌రం గంగుల ప్ర‌భాక‌ర్ మృతిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.