రాహుల్ కామెంట్: అప్ప్పుడు అందుకే అలా చేశా..

కొన్నాళ్ల క్రితం పార్ల‌మెంటులో ప్ర‌ధాని మోదీని రాహుల్ ఆలింగ‌నం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అ సంఘ‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. మోదీ కూడా కాసేపు అలా షాక్ కు గుర‌య్యారు కూడా. ఏం జ‌రుగుతోందో అర్థంకాని ప‌రిస్థితి. రాహుల్ చ‌ర్య‌పై బీజేపీతో పాటు సోష‌ల్ మీడియాలోనూ ఓ రేంజ్ లో కామెంట్స్ వినిపించాయి. విమ‌ర్శ‌లు వ‌చ్చాయి కూడా. అయితే రాహుల్ వీటిపై స్పందించ‌కుండా త‌న‌ప‌ని తాను చేసుకుంటూ పోయారు. తాజాగా రాహుల్ ఆ సంఘ‌ట‌న‌ను మ‌ళ్లీ గుర్తు చేశారు. అస‌లు ఎందుక‌లా చేశాన‌నే దానిపై క్లారిటీ ఇచ్చారు.

జర్మనీ హాంబర్గ్‌లో జరిగిన యంగ్ లీడర్స్‌ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారత్‌లో అసహనం ప్రమాదకరంగా మారిందని ఆయ‌న ఆందోళన వ్యక్తం చేశారు. హింసకు తన తండ్రి, నాన్నమ్మ బలయ్యారని రాహుల్ గుర్తు చేశారు. విద్వేషానికి విద్వేషమే సమాధానం కాదని, క్షమాగుణమే అన్నిటికన్నా గొప్పదన్నారు. ప్రధాని మోదీ తనపై విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తుంటే తాను వెళ్లి ఆయన్ను ఆలింగనం చేసుకుని తన ప్రేమను చాటానని రాహుల్ చెప్పారు.