మ‌ళ్లీ జైట్లీకే ఆర్థికం..!

మొద‌ట్లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన అరుణ్ జైట్లీ అనారోగ్య కార‌ణాల‌తో గ‌త కొంత కాలంగా ఆ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకుని మూడు నెల‌ల త‌రువాత తాజాగా కేంద్ర ఆర్థిక, కార్పోరేట్ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా ఆయ‌న మ‌ళ్లీ బాద్య‌త‌లు చేప‌ట్టారు. ఇప్పటివరకు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను ఈ బాధ్యతలను తప్పిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.