నల్లగొండ టీఆర్ఎస్’లో ముదిరిన వర్గపోరు.
గ్రూపు తగాదాలు లేకుండా అందరినీ సమన్వయం చేసుకోవాలని బుధవారం మంత్రులతో సీఎం కేసీఆర్ ఇలా చెప్పారో లేదో టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాల విషయంలో ఎవరు ఎవరికి వినేలా కనిపించడం లేదు. సదరు మంత్రులు కూడా సమన్వయానికి యత్నించడకుండా సీఎం మాటలను ఇలా విని అలా వదిలేశారేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారట సొంత పార్టీ నేతలు. కాంగ్రస్ కంచుకోటగా ఉన్న నల్లగొండపై గులాబీ జెండా ఎగరేస్తామని ఢంకా బజాయించి చెబుతున్నా ఆ పార్టీలో మాత్రం అంతర్గత విభేదాలు రోజురోజుకు ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డికి మధ్య అంతర్గతంగా విభేధాలు ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో నల్లగొండ టీఆరెస్ లో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరాయి. సాగర్ ఎడమకాల్వ నీటి విడుదల సమయంలో వీరిద్దరి మధ్య అంతర్గత పోరు బహిర్గతమైంది. స్థానికంగానే ఉండి నీటి విడుదలకు దూరంగా ఉన్నారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. దీంతో ఎంపీ గుత్తా లేకుండానే మరో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తో కలిసి నీటిని విడుదల చేసిన మంత్రి జగదీష్ రెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో అంతర్గత పోరు ఆ పార్టీకి నష్టం చేస్తుందని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.