‘దేవదాస్’ టీజర్ టాక్

నాగ్-నానిల మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. టైటిల్ తగ్గట్టుగానే తప్పతాగి బెడ్ మీద పడుకొన్న నాని, నాగ్ ల పిక్ ని ఫస్ట్ లుక్ గా వదిలారు. ఇక, ట్రైలర్ రిలీజ్ డేటు ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ లోనూ హీరోలిద్దరు పెగ్గులేస్తున్నట్టు చూపించారు. ఫస్ట్ పెగ్ వేసేది రేపే అంటూ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశారు.

ఇప్పుడా టీజర్ వచ్చేసింది. ముందుగా చెప్పినట్టుగానే నాగ్, నాని సిట్టింగ్ వేసేశారు. పస్ట్ పెగ్, రెండో పెగ్ కూడా పడింది. ఐతే, అది ఫన్నీగా ఉంది. ‘సిట్టింగ్ లో నాగ్ నాని.. మందు బాటిల్ ఓపెన్ చేసిన నాగార్జున.. అక్కడ ఒక్కటే గ్లాసు.. కాస్త భయంగా నాని రెండో గ్లాసు పెట్టేయడం.. సోడా కావాలా అని నాగ్ అడిగేలోపే నాని రా కొట్టేశాడు. మళ్లీ పెగ్ పోసి.. సోడాకావాలా అనే లోపే ఇది లోపలికి పోయింది. దాసు ఏంటీ.. ? అని నాగ్ అడగటంతో’ టీజర్ ని కట్ చేశారు. ‘మధ్యపానం ఆరోగ్యానికి హానికరం. రా కొడితే ఆరోగ్యానికి ఇంకా హానికరం’ అని చెప్పకనే చెప్పారు. టీజర్ లో సెప్టెంబర్ 27న సినిమాని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఈ చిత్రంలో నాగ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో, ఆయన డాక్టర్ పాత్రలో నాని కనిపించబోతున్నారు. నాగ్ సరసన ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక మందన జతకట్టనున్నారు. తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచేపోయిన టైటిల్ ఇది. అందుకు తగ్గట్టుగానే టీజర్ తో అదరగొట్టారు దేవదాస్ లు.