మహేష్ పేరుని వాడుకొంటున్న బెల్లకొండ !

యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్’కు విజయం అందని ద్రాక్షలా మారింది. ఆయన సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంటాయి. ఆయన పక్కన స్టార్ హీరోయిన్ ఉండాల్సిందే. మరో స్టార్ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ తప్పనిసరి. ఫైనల్ గా ఓ స్టార్ హీరో రేంజ్ లో బెల్లకొండ సినిమా ముస్తాబవుతాయ్. అయినా.. విజయం మాత్రం దక్కడం లేదు.

ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన బెల్లకొండ ‘సాక్ష్యం’ కోసం రూ. 40కోట్లు ఖర్చు చేశారు. తీరా సినిమా విడుదలై రూ. 10కోట్లు కూడా తీసుకురాలేకపోయింది. దీంతో.. ఇకపై భారీ బడ్జెట్ సినిమాలని చేయకూడదని బెల్లకొండ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో బెల్లకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు పేరుని వాడుకోవాలని చూస్తున్నాడట బెల్లకొండ. అది కూడా మహేష్ అనుపతి లేకుండానే.

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు తేజ. ఈ సినిమాలో హీరో రాధా జోగేంద్ర.. అంటే తను ప్రాణప్రదంగా ప్రేమించిన అమ్మాయి పేరును తన పేరు ముందు పెట్టుకుంటాడు. ఇప్పుడు బెల్లకొండ సినిమాలోనూ అంతే. హీరో పేరు రామ్. హీరోయిన్ పేరు సీత. వెరసి సీతారామ్ అన్నమాట. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ.. ! తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నిజం’ సినిమాలో మహేష్ పేరు సీతారామ్. ఇప్పుడా పేరుని బెల్లకొండ శ్రీనివాస్ వాడుకోనున్నాడు. మరీ.. మహేష్ పేరు పెట్టుకొన్న బెల్లకొండకు ఓ హిట్ దక్కుతుందేమో చూడాలి.