అదంతా ఉత్త ముచ్చటే.. కేటీఆర్ కు రేవంత్ సవాల్..
ప్రగతి నివేదన సభకు ఇరవై ఐదు లక్షల మంది వస్తారంటూ సీఎం చెబుతున్నదంతా ఒట్టి ముచ్చటేనని రేవంత్ అన్నారు. రెండు లక్షల మందితో ఇరవై ఐదు లక్షలు అని కేసీఆర్ చూపబోతున్నారని, టక్కు టమార విద్యల్లో భాగమే కేసీఆర్ 25లక్షలజనాల మాట అని ఆయన అన్నారు. 25లక్షల మంది రావాలంటే రెండుడ లక్షల వాహనాలు రావాలని, అలా సభ నిర్వహించాలంటే కనీసం 4వందల కోట్లు కావాలని ఆయన అన్నారు. కేసీఆర్ కు ఇన్ని వందల కోట్లు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు. గ్రామాలకు వెళ్లే ముఖం లేక హైదరాబాద్ లో సభతో ప్రజలను మభ్యపెడుతుననారని ఆయన ఆరోపించారు.
ఈ విషయంపై మంత్రి కేటీఆర్ కు రేవంత్ సవాల్ విసిరారు. సిరిసిల్ల నుంచి 25 వేల మంది వస్తారా .. అంటూ ఎద్దేవావ చేశారు. అక్కడ చెక్ పోస్ట్ పెడితే తేలిపోతుందని, చెక్ పోస్ట్ దగ్గర 25వందల వాహనాల నంబర్స్ తో వాట్సాఅప్ లో పెట్టాలని, కేటీఆర్ ఈ పరీక్షకు రెడీనా అంటూ రేవంత్ సవాల్ విసిరారు. గ్రామసభ పెడితే జనం టీఆర్ఎస్ నేతలను బట్టలూడదీసి కొడతారని, టీఆర్ఎస్ న ప్రజలు ఓడించడం ఖాయమని ఆయన అన్నారు.